జులై 5 మంగళవారం మీ రాశిఫలాలు



మేషం
ఉద్యోగాలు మారాలి అనుకునేవారికి ఇదే మంచి సమయం. కుటుంబంతో సంతోష సమయం గడుపుతారు.ఫ్యాషన్, గ్లామర్‌తో సంబంధం ఉన్న వ్యక్తులకు ఈ రోజు మంచిది. పని ఒత్తిడి ఉన్నప్పటికీ లక్ష్యాన్ని పూర్తిచేస్తారు. మీ రహస్యాలను ఎవ్వరికీ చెప్పొద్దు.



వృషభం
ఈ రోజంతా సంతోషంగా ఉంటారు. భార్యాభర్తల మధ్య మనస్పర్థలు తొలగిపోతాయి. మీ సమస్యలు పరిష్కారమవుతాయి. సహోద్యోగుల నుంచి మీకు మద్దతు లభిస్తుంది. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. కార్యాలయంలో అధికారుల ప్రోత్సాహం ఉంటుంది.



మిథునం
ఈ రోజు మీకు చాలా మంచిరోజు. ఆహారంపై శ్రద్ధ వహించండి. విద్యార్థులు పరీక్షలో విజయం సాధిస్తారు. ప్రభుత్వ ఉద్యోగంలో బదిలీ ఉండవచ్చు. ఓ గొప్ప వ్యక్తిని కలిసే అవకాశం ఉంది. వ్యాయామం , యోగాను మీ దినచర్యలో భాగంగా చేసుకోండి.



కర్కాటకం
మీ పని విషయంలో ఇతరులపై ఎక్కువ ఒత్తిడి పెట్టకండి. కొత్త సంబంధాల విషయంలో జాగ్రత్తగా ఉండండి. అతి విశ్వాసానికి దూరంగా ఉండాలి. మరింత కష్టపడితే కానీ ఉత్తమ ఫలితాలు అందుకోలేరు. ఎవరినీ దుర్భాషలాడొద్దు.



సింహం
అధిక పనివలన అలసిపోతారు. ఆర్థిక పరిస్థితి బావుంటుంది. కార్యాలయంలో మీ బాధ్యత పెరుగుతుంది. అసంపూర్తిగా ఉన్న పనులు ఈరోజు ప్రారంభిస్తారు. కుటుంబం ,స్నేహితులతో సంతోషంగా ఉంటారు. వ్యాపారంలో భారీ లాభాలుంటాయి.



కన్య
అనుకున్న పనులు అనుకున్న సమయానికి పూర్తిచేసేందుకు ప్రయత్నించండి. సమయపాలన అలవాటు చేసుకోండి. పనికిరాని ఆలోచనలకు దూరంగా ఉండండి. మీకు సంబంధం లేని లావాదేవీల విషయంలో అనవసరంగా తలదూర్చవద్దు. ఖర్చులు తగ్గించుకోండి.



తులా
ఈ రోజు సాధారణంగా ఉంటుంది. కెరీర్ విషయంలో చాలా ప్రోగ్రెసివ్ గా ఉంటారు. కొత్త ఆదాయ వనరులను సృష్టించుకుంటారు. మీరు చేయాల్సిన పనులు సకాలంలో పూర్తిచేయగలుగుతారు. ఉద్యోగంలో ఉన్నత స్థానంలో ఉంటారు. ఇంటా బయటా గౌరవం పొందుతారు.



వృశ్చికం
ప్రత్యర్థులపై ఆధిపత్యం చెలాయిస్తారు. తెలియని వ్యక్తుల పట్ల జాగ్రత్త వహించండి.సామాజిక కార్యక్రమాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. మనసులో ప్రశాంతత ఉంటుంది. మీ మనసు చెప్పింది వినండి. వ్యాపారంలో కొత్త భాగస్వాములు చేరొచ్చు. ఆరోగ్యం చాలా బాగుంటుంది.



ధనుస్సు
ఈ రోజు మంచి రోజు అవుతుంది. ఎప్పటి నుంచో వెంటాడుతున్న అనారోగ్య సమస్యలు తీరుతాయి. అనుకున్న పనులన్నీ పూర్తవుతాయి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. సామాజిక కార్యక్రమంలో పాల్గొంటారు. ఇంట్లో ఉన్న వృద్దులను జాగ్రత్తగా చూసుకోండి.



మకరం
మకర రాశివారికి ఈరోజు అంతగా బాలేదు. కుటుంబ సభ్యులతో అనవసర విషయాలకే వివాదం తలెత్తుతుంది. కోపంతో దూషించే పదాలు వాడొద్దు. ప్రశాంతంగా ఉండేందుకు ప్రయత్నించండి. పాత సమస్య నుంచి బయటపడే అవకాశం ఉంది. ప్రయాణం చేయాల్సి ఉంటుంది.



కుంభం
ఈ రోజు మీకు అద్భుతంగా ఉంటుంది. మీ సమస్య పరిష్కారం అవడంతో ప్రశాంతంగా ఉంటారు. కుటుంబంలో ఒకరి వివాహంపై చర్చ జరుగుతుంది. ప్రేమికులు తమ మనసులో మాట చెప్పొచ్చు. విద్యార్థులకు చదువుల పట్ల ఆసక్తి పెరుగుతుంది.



మీనం
దంపతుల మధ్య సఖ్యత ఉంటుంది. మీ పనిని మీరు నమ్మండి. మీ కిందస్థాయి ఉద్యోగులను నిర్లక్ష్యం చేయవద్దు. నూతన ఆభరణాలు, వస్త్రాలు కొనుగోలు చేసే అవకాశం ఉంది. సంపద పెరుగుతుంది. ఈ రోజు ఎవరికీ అప్పు ఇవ్వొద్దు. ఆకస్మికంగా ప్రయాణం చేయాల్సి రావొచ్చు.