క్యారెట్ తురుము - అరకప్పు వండిన అన్నం - ఒక కప్పు ఉల్లిపాయ తరుగు - పావు కప్పు పచ్చిమిర్చి - మూడు జీడిపప్పు - ఆరు మిరియాల పొడి - చిటికెడు
గరం మసాలా - చిటికెడు జీలకర్ర - అర టీస్పూను ఆవాలు - అర టీస్పూను కరివేపాకు - ఒక రెబ్బ కొత్తి మీరు తరుగు - ఒక స్పూను ఉప్పు - రుచికి సరిపడా నూనె - తగినంత పసుపు - పావు స్పూను
నూనెలో ఆవాలు, జీలకర్ర, జీడిపప్పు వేసి వేయించాలి.
తరువాత ఉల్లి తరుగు, పచ్చి మిర్చి, క్యారెట్ తురుము వేసి వేయించాలి.
అవి వేగాక పసుపు, మిరియాల పొడి, గరం మసాలా, ఉప్పు వేసి కలపాలి.
ఇప్పుడు వండిన అన్నాన్ని వేసి కలపాలి. పైన కొత్తమీరను చల్లుకోవాలి.
అంతే టేస్టీ క్యారెట్ రైస్ సిద్ధం. పిల్లలు ఇష్టంగా తినడం గ్యారెంటీ.