షియోమీ 11టీ ప్రో వర్సెస్ వన్‌ప్లస్ 9ఆర్‌టీ: ఏది బెస్ట్ ఫోన్ షియోమీ 11టీ ప్రో ధర రూ.39,999 నుంచి ప్రారంభం కానుంది. వన్‌ప్లస్ 9ఆర్‌టీ ధర రూ.42,999 నుంచి ప్రారంభం కానుంది. షియోమీ 11టీ ప్రోలో 6.67 అంగుళాల డిస్‌ప్లేను అందించారు. వన్‌ప్లస్ 9ఆర్‌టీలో 6.6 అంగుళాల డిస్‌ప్లేను అందించారు. ఈ రెండు ఫోన్లూ ఆండ్రాయిడ్ 11పైనే పనిచేయనున్నాయి. క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్ 888 ప్రాసెసర్‌నే రెండు ఫోన్లలోనూ అందించారు. రెండిట్లోనూ 8 జీబీ, 12 జీబీ ర్యామ్ వేరియంట్లు ఉన్నాయి. రెండు ఫోన్లలోనూ 128 జీబీ, 256 జీబీ స్టోరేజ్ వేరియంట్లు అందించారు. షియోమీ 11టీ ప్రోలో వెనకవైపు 108 + 8 + 5 మెగాపిక్సెల్ కెమెరాలు ఉన్నాయి. వన్‌ప్లస్ 9ఆర్‌టీలో వెనకవైపు 50 + 16 + 2 మెగాపిక్సెల్ కెమెరాలు అందించారు. రెండిట్లోనూ ముందువైపు 16 మెగాపిక్సెల్ కెమెరాను అందించారు. షియోమీ 11టీ ప్రోలో 5000 ఎంఏహెచ్ బ్యాటరీని అందించారు. వన్‌ప్లస్ 9ఆర్‌టీలో 4500 ఎంఏహెచ్ బ్యాటరీని అందించారు. షియోమీ 11టీ ప్రో 120W ఫాస్ట్ చార్జింగ్‌ను సపోర్ట్ చేయనుంది. వన్‌ప్లస్ 9ఆర్‌టీ 65W ఫాస్ట్ చార్జింగ్‌ను సపోర్ట్ చేయనుంది.