టీమ్‌ఇండియాలో మరో క్రికెటర్ తన బ్యాచిలర్ లైఫ్‌కు గుడ్‌బై చెప్పేస్తున్నాడు. కోరుకున్న ప్రియురాలితో సరికొత్త జీవితం ఆరంభించబోతున్నాడు. తన పుట్టినరోజునే ప్రేయసితో నిశ్చితార్థం చేసుకున్నాడు. అరంగేట్రం సిరీసులోనే ఐదు వికెట్ల ఘనతలు అందుకున్న ఆటగాడు అక్షర్ పటేల్. గురువారం అతడి 28వ పుట్టినరోజు. తన ప్రేయసి మెహాతో నిశ్చితార్థం చేసుకున్నాడు. ఈ వేడుకకు అక్షర్ పటేల్ సన్నిహితులు, బంధువులు, గుజరాత్ క్రికెటర్లు హాజరయ్యారు. 'ఈ రోజు నా జీవితానికి సరికొత్త ఆరంభం. ఎప్పటికే కలిసే ఉంటాం. బతికున్నంత వరకు ప్రేమిస్తూనే ఉంటా' అని పోస్ట్ చేశాడు.