బరువు, గుండె సమస్యలు తగ్గేందుకు రోజూవారీ ఆహారంలో రైస్ బదులు ఈ ధాన్యాలను తీసుకోవడం మంచిదని పోషకాహార నిపుణులు సూచిస్తున్నారు. అవేంటో చూసేయండి మరి. మిల్లెట్స్: వీటినే తృణధాన్యాలు అంటారు. ఇవి గ్లూటెన్ లేనివి. మిల్లెట్స్: వీటిలో ప్రోటీన్, ఫైబర్, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. సజ్జలు: వీటిలో ప్రోటీన్, ఫైబర్, మెగ్నీషియం, ఐరన్, కాల్షియం ఉంటాయి. సజ్జలు: వీటిలో చాలా తక్కువ కేలరీలు ఉంటాయి. బరువు తగ్గేవారికి మంచిది. జొన్నలు: వీటిలో విటమిన్ బి, మెగ్నీషియం, యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి. జొన్నలు: ఫ్లేవనాయిడ్స్, ఫినోలిక్ ఆమ్లాలు, టానిన్‌లతో సహా అనేక పోషకాలు ఉంటాయి. రాగులు: ఇందులో ఐరన్ పుష్కలంగా ఉంటుంది. రాగులు: వీటిలో ఎర్ర రక్త కణాలలో హిమోగ్లోబిన్ ఉత్పత్తికి అవసరమైన ట్రేస్ మినరల్ ఉంటుంది. రాజ్‌గిరా: దీన్ని కొన్ని ప్రాంతాల్లో ఎర్ర తోటకూర గింజలు అంటారు. రాజ్‌గిరా: ఇందులో ఫైబర్, ప్రోటీన్, మెగ్నీషియం, భాస్వరం, ఐరన్ పుష్కలంగా ఉంటాయి.