అశ్విని నుంచి రేవతి వరకూ మొత్తం 27 నక్షత్రాలు, ఒక్కో నక్షత్రానికి నాలుగు పాదాలుంటాయి. కొన్ని నక్షత్రాల్లో నాలుగు పాదాలకి దోషం ఉంటే..మరికొన్ని నక్షత్రాల్లో ఒక్కో పాదానికి ఒక్కో ఫలితం ఉంటుంది.



1. అశ్విని 1 వ పాదములో పుట్టిన పిల్లల వల్ల తండ్రికి దోషం. అశ్విని 2 3 4 పాదాల్లో జన్మించిన వారికి దోషం లేదు.



2. భరణి 1 2 4 పాదాల్లో పుట్టిన పిల్లలకు ఎలాంటి దోషం లేదు. 3 వ పాదములో ఆడపిల్ల పుడితే తల్లికి, మగపిల్ల పుడితే తండ్రికి దోషం ఉంటుంది.



3. కృత్తిక నక్షత్రంలో 3వ పాదంలో పుట్టిన ఆడపిల్ల వల్ల తల్లికి, మగపిల్లాడు వల్ల తండ్రికి దోషం ఉంటుంది. 1 2 4 పాదాల్లో పుట్టిన వారికి స్వల్ప దోషం ఉంటుంది.



4. రోహిణి నక్షత్రం 1 వ పాదంలో జన్మిస్తే మేనమామకు, రెండో పాదంలో తండ్రికి, మూడో పాదంలో తల్లిది దోషం ఉంటుంది. నాలుగో పాదంలో పుడితే ఎవ్వరికీ ఎలాంటి దోషం ఉండదు.



5. మృగశిర 1 2 3 4 పాదాల్లో జన్మించిన వారికి ఎలాంటి దోషాలు ఉండవు.



6. ఆరుద్ర నక్షత్రం 1 2 3 పాదముల్లో జన్మంచిన వారికి దోషం లేదు 4 వ పాదంలో పుడితే సామాన్య శాంతి అవసరం.



7. పునర్వసు నక్షత్రము 1 2 3 4 పాదములు అన్నీ మంచివే. ఏ విధమైన శాంతి అవసరము లేదు.



నక్షత్రంతో సంబంధం లేకుండా పేగులు మెడలో వేసుకుని పుట్టినా, కాళ్లు మొదట బయటకు వస్తూ పుట్టినా, గ్రహణ సమయంలో జన్మించినా, తండ్రిదండ్రులు, తోబుట్టువల జన్మ నక్షత్రంలో పుట్టినా తప్పక శాంతి చేయించాలి.



శాంతిరోజు ఏం చేయాలనేది నక్షత్రం, పాద దోషంపై ఆధారపడి ఉంటుంది. మీరు విశ్వసించే పండితుల దగ్గరకు వెళ్లి పూర్తివివరాలు తెలుసుకుని శాంతి చేయించాలి...