రోజుకు రెండు స్పూనుల నువ్వులు తింటే చాలు...

నువ్వులు ప్రాచీన కాలం నుంచి భారతీయ ఆహారంలో భాగంగా ఉన్నాయి. కానీ ఆధునిక కాలంలో వీటి వాడకం చాలా తగ్గిపోయింది.

అధ్యయనం ప్రకారం రోజుకు రెండు స్పూనుల నువ్వులు తినడం వల్ల చెడు కొలెస్ట్రాల్ స్థాయిలు 8 నుంచి 16 శాతం తగ్గుతాయి. మొత్తంగా కొవ్వు శాతాన్ని 8 శాతం వరకు తగ్గిస్తాయి.

నువ్వుల్లో ఆరోగ్యకరమైన కొవ్వులు, ఫైబర్, ప్రోటీన్, విటమిన్ ఇ, మాంగనీస్ అధికంగా ఉంటాయి, చక్కెర తక్కువ స్థాయిలో ఉంటుంది. కాబట్టి చలికాలంలో వీటిని తింటే ఎంతో మేలు.

ఆయుర్వేదం ప్రకారం నువ్వులు మధుమేహం, ప్రేగు వ్యాధి, అధిక రక్తపోటుపై ప్రభావవంతంగా పనిచేస్తుంది.

నువ్వులను ఒక నిమిషం పాటూ వేయించుకుని వంటల్లో భాగం చేసుకోవచ్చు. లేదా వేయించుకున్న నువ్వులు నేరుగా తినేసినా మంచిదే.

వంటల్లో నువ్వుల నూనెను ఉపయోగించినా మంచిదే. కాకపోతే ధర ఎక్కువ.

ఏదో రకంగా రోజూ నువ్వులు శరీరంలోకి చేరితే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి.