ఒకప్పుడు సినిమా ఎన్ని రోజులు థియేటర్లో ఆడిందనే దాన్నిబట్టి సక్సెస్ ను మెజర్ చేసేవారు. కానీ ఇప్పుడు పరిస్థితి మారింది.
సినిమాలు విడుదలైన రెండు, మూడు వారాలకే ఓటీటీల్లో రిలీజ్ అయిపోతున్నాయి.
పాండమిక్ లో థియేటర్లలో సినిమాలు రిలీజ్ చేయడానికి భయపడుతున్న టైంలో కొన్ని తెలుగు చిత్రాలు మాత్రం 50 రోజులకు మించి థియేటర్లలో ఆడాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం!
అలవైకుంఠపురములో - అల్లు అర్జున్ నటించిన ఈ సినిమా 175 సెంటర్స్ లో యాభై రోజులు ఆడింది.
సరిలేరు నీకెవ్వరు - 110 సెంటర్స్ లో యాభై రోజులు పూర్తి చేసుకుంది ఈ సినిమా.
క్రాక్ - 110 సెంటర్స్ కంటే ఎక్కువ థియేటర్లలో యాభై రోజులు ఆడింది.
జాతిరత్నాలు - 50 ప్లస్ థియేటర్స్ లో యాభై రోజులు పూర్తి చేసుకుంది.
ఉప్పెన - 100 ప్లస్ థియేటర్స్ లో 50 రోజులు ఆడింది.
పెళ్లి సందడి - ఈ సినిమా మంచి టాక్ రానప్పటికీ ఐదు థియేటర్లలో యాభై రోజులు ఆడింది.
అఖండ - 103 థియేటర్లలో యాభై రోజులు పూర్తి చేసుకుంది.