ప్రపంచంలో ప్రమాదకరమైన ఉద్యోగం ఇదే

అతి ప్రమాదకరమైన ఉద్యోగాలు ఎన్నో ఉన్నాయి. అందులో మొదటి స్థానం సల్ఫర్ సేకరించే ఉద్యోగం.

ఈ పనిచేసే వారెవరూ 50 ఏళ్లు దాటి బతకడం చాలా కష్టం.

ఇండోనేషియాలోని అగ్నిపర్వతం లోపల సల్ఫర్ మైనింగ్ జరుగుతుంది.



90 కిలోల సల్ఫర్‌ను సేకరించి బుట్టల్లో నింపి బయటికి వస్తారు.

సల్ఫర్ ఉన్న ప్రాంతంలోనే రోజు కొన్ని గంటల పాటూ ఉండడం వల్ల ఆ రసాయనానికి వారి శరీరం ప్రభావితం అవుతుంది.

ఆ చుట్టు పక్కల గ్రామాల్లోని మైనర్లంతా ఇందులో పనిచేస్తారు. అందుకే వీరు ఎక్కువ కాలం జీవించరు.

ఇంత కష్టపడి పనిచేసే ఉద్యోగం అయినా వీరికి రోజుకు చెల్లించేది చాలా తక్కువ.

రోజుకు 12 డాలర్లు అంటే రూ.954 చెల్లిస్తారన్నమాట.