కరకరలాడే క్యాప్సికమ్ రింగ్స్ పకోడీ



క్యాప్సికమ్ - నాలుగు
బియ్యప్పిండి - పావు కప్పు
శెనగపిండి - ఒక కప్పు
బేకింగ్ సోడా - చిటికెడు

అల్లంవెల్లుల్లి పేస్టు - పావు టీస్పూను
నీళ్లు - కలపడానికి సరిపడా
కారం - ఒక స్పూను
నూనె - డీప్ ఫ్రైకి సరిపడా

చిన్న పరిమాణంలో ఉన్న క్యాప్సికమ్ ఎంచుకుని గుండ్రంగా చక్రాల్లా కోసుకోవాలి.



ఒక గిన్నెలో శెనగపిండి, బియ్యప్పిండి, ఉప్పు, కారం వేసి బాగా కలపాలి.



అందులోనే అల్లం వెల్లుల్లి పేస్టు, బేకింగ్ సోడా కూడా వేయాలి.



ఇప్పుడు కొంచెం కొంచెం నీళ్లు పోసుకుంటూ పకోడీ పిండిలా కలుపుకోవాలి.



ఇప్పుడు ముందుగా కోసి పెట్టుకున్న క్యాప్సికమ్ ముక్కల్ని అందులో వేయాలి.



కళాయిలో నూనె బాగా వేడెక్కాక క్యాప్సికమ్ ముక్కల్ని వేసుకుని వేయించాలి.



వర్షం పడే సాయంత్రం వీటిని వేడివేడిగా తింటే ఆ రుచే వేరు.