ఆస్పిరిన్ ట్యాబ్లెట్లతో ఎన్నో ఉపయోగాలు ఆస్పిరిన్ ట్యాబ్లెట్లు చాలా ముఖ్యమైనవి. ఇవి ప్రతి ఇంట్లో ఉండాల్సిన అవసరం ఉంది. ఎవరికైనా గుండె పోటు వచ్చిన వెంటనే వైద్యులు సైతం రోగికి ఆస్పిరిన్ అందిస్తారు. ఇది స్టెరాయిడ్ కాదు కానీ, వాటి వల్ల కలిగే ఇతర ప్రయోజనాలు వీటితో కలుగుతాయి. తలనొప్పి, జలుబు, కాళ్లు బెణుకులు, కీళ్ల నొప్పులు, మైగ్రేన్,రుతుసమయంలో వచ్చే తిమ్మిరి నొప్పిని తగ్గిస్తుంది. గుండెపోటుకు సంబంధింది కరోనరీ సమస్యలను నివారించడంలో ఆస్పిరిన్ మేలు చేస్తుంది. ఆర్ధరైటిస్, కీళ్ల వాపు, లూపర్, గుండె చుట్టూ వాపు రావడం వంటి ఆరోగ్య పరిస్థితులలో కూడా ఆస్పిరిన్ ను ఉపయోగిస్తారు. ఆస్పిరిన్ మాత్రల్లో సాలిసిలిక్ ఆమ్లం ఉంటుంది. ఇది చర్మానికి మేలు చేస్తుంది. రెండు ఆస్పిరిన్ ట్యాబ్లెట్లు పొడి చేసి అందులో కాస్త నీళ్లు కలిపి మొటిమలకు రాసుకోవాలి. ఇలా చేయడం వల్ల మొటిమల వల్ల కలిగే బాధ తగ్గుతుంది. అయితే వైద్యుని సలహాతోనే దీన్ని వాడాలి.