కాకరకాయ చిప్స్ ఇలా చేస్తే సూపర్



కాకరకాయలు - వంద గ్రాములు
పసుపు - అర స్పూను
ధనియాల పొడి - అర స్పూను
కారం - అర స్పూను



జీలకర్ర పొడి - అర స్పూను
నూనె - డీప్ ఫ్రై చేయడానికి సరిపడా
బియ్యప్పిండి - యాభై గ్రాములు
కార్న్ ఫ్లోర్ - యాభై గ్రాములు



కాకరకాయలను గుండ్రంగా చక్రాల్లా కోసుకోవాలి.



ఉప్పు కలిపిన నీళ్లలో అయిదునిమిషాలు నానబెడితే చేదు పోతుంది.



ఒక గిన్నెలో కాకర ముక్కలు, జీలకర్ర పొడి, పసుపు, కారం, ధనియాల పొడి, ఉప్పు, బియ్యప్పిండి, కార్న్ ఫ్లోర్ వేసి బాగా కలపాలి.



వాటిని నూనెలో వేయించాలి.



క్రిస్పీగా వేయించుకుంటే రుచి బావుంటుంది.



ఆయిల్ పీల్చే కాగితంపై వేస్తే నూనె మొత్తం పీల్చేస్తుంది. తరువాత తినాలి.