పిల్లల కోసం పాలకూర రైస్

బాస్మతి అన్నం - ఒక కప్పు
పాలకూర తరుగు - ఒక కప్పు
ఉల్లితరుగు - పావు కప్పు
పచ్చి మిర్చి - రెండు
పచ్చి బఠానీలు - పావు కప్పు
ఉప్పు - రుచికి సరిపడా
నూనె - అరస్పూను

ముందుగా బాస్మతి రైస్ వండి పెట్టుకోవాలి.

ఇప్పుడు స్టవ్ మీద కళాయి పెట్టి నూనె వేయాలి. అందులో పాలకూర ఆకులు వేసి వేయించాలి.

పాలకూరలోని నీళ్లు దిగి, ఇంకిపోయాక ఆకులు దగ్గరగా అవుతాయి.

అప్పుడు వాటిని మిక్సీలో వేసి పేస్టులా చేసుకోవాలి.

ఇప్పుడు అదే కళాయిలో నెయ్యి వేసుకోవాలి.

ఉల్లిపాయ తరుగు, పచ్చిమిర్చి తరుగు, పచ్చి బఠానీలు వేసి వేయించాలి.

అవన్నీ వేగాక మెత్తని పేస్టులా చేసుకున్న పాలకూర పేస్టు, ఉప్పు వేసి కలుపుకోవాలి.

అన్నీ వేగాక ముందుగా వండి పెట్టుకున్న అన్నాన్ని కలిపేసుకోవాలి. అంతే పాలకూర రైస్ సిద్ధమైనట్టే.