నిద్ర లేకపోతే ఎన్ని సమస్యలు వస్తాయో తెలుసా?

రోజూ సరిగా నిద్రపోవడం లేదా? అయితే, ఈ సమస్యలు మిమ్మల్ని వెంటాడుతాయ్.

మెదడు సక్రమంగా పని చెయ్యడానికి నిద్ర బాగా అవసరం. నిద్రలేమి వల్ల ఆలోచన విధానం మందగిస్తుంది.
నిద్రపోతున్నపుడు మెదడు నాడీ వ్యవస్థ నుంచి అన్ని వ్యర్థాలను తొలగిస్తుంది.

రోగనిరోధక శక్తిని పెంచేందుకు నిద్ర సహాయపడుతుంది.

మనం నిద్రపోతున్నప్పుడు విడుదలయ్యే సైటోకిన్‌లు ఇన్ఫెక్షన్లు, వైరస్‌లతో పోరాడుతుంది.

నిద్ర లేకపోతే టైప్ 2 డయాబెటిస్ వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది.

డిప్రెషన్, అల్జీమర్స్ బారిన పడే అవకాశాలు ఉన్నాయి.

సరిపడినంత నిద్ర లేకపోతే ఊబకాయం, అధిక బరువు వచ్చే అవకాశాలు ఎక్కువ.

నిద్ర లేమి వల్ల ఆకలి పెరుగుతుంది. దీని వల్ల ఎక్కువ కేలరీలు తీసుకునే ప్రమాదం ఉంది.

సరిగా నిద్రపోకపోతే రక్తపోటు స్థాయిలు పెరిగి గుండె జబ్బులు వచ్చే అవకాశం ఉంది.