మీల్ మేకర్ ఎలా తయారుచేస్తారో తెలుసా? మీల్ మేకర్ విషయంలో అందరికీ ఉండే సందేహం ఒక్కటే, అవి దేనితో తయారుచేస్తారు అని? మీల్ మేకర్ అన్నా, సోయా చంక్స్ ఒక్కటే. ఈ రెండూ తయారయ్యేది సోయా గింజలతోనే. సోయా చిక్కుడు గింజల నుంచి ఆయిల్‌ను ముందుగా వేరుచేస్తారు. సోయా నూనెను తయారుచేస్తున్నప్పుడు ఏర్పడే ఉప పదార్థమే సోయా పిండి. ఆ పిండిని మీల్ మేకర్ గా మారుస్తారు. దీనిలో కూడా పోషకాలు అధికంగానే ఉంటాయి. దీన్ని వెజిటేరియన్ మీట్ అని చెప్పుకోవచ్చు. అందుకే పాశ్చాత్యదేశాల్లో సోయా మీట్ అని కూడా పిలుస్తారు. గుండెజబ్బులు, క్యాన్సర్లు వంటి వ్యాధులు వచ్చే ప్రమాదాన్ని చాలా మేరకు తగ్గిస్తుంది.