భూమ్మీద పుట్టినవాళ్లలో ఇతనే అత్యంత ధనవంతుడు ప్రపంచంలో ఇప్పటివరకు పుట్టినవాళ్లలో అత్యంత ధనవంతుడు ఎవరో తెలుసా? మాన్సా మూసా. అతను ఓ ఆఫ్రికన్ రాజు. 12వ శతాబ్ధంలో ఈయన జీవించాడు. 12వ శతాబ్ధంలో టింబక్తు అనే రాజ్యాన్ని పరిపాలించాడు. అదే రాజ్యం ఇప్పుడు మాలి దేశంగా మారింది. అప్పటి అతని ఆస్తిని ఇప్పుడు లెక్కల్లో చెప్పాలంటే ఎంత లేదన్నా రూ.31 లక్షల కోట్లు ఉంటుందని అంచనా. ఇంత ఆస్తి ఉన్న వ్యక్తి ఇంతవరకు భూమ్మీద పుట్టలేదు. మాన్సా రాజ్యంలోనే ప్రపంచంలో ఉన్న సగం బంగారం ఉండేదని చెప్పుకుంటారు చరిత్రకారులు. ఆయన మక్కా ప్రయాణానికి వెళుతూ తన వెంట 60,000మంది మగ పనివారు, 12,000 బానిసలను తీసుకెళ్లారు. వీరంతా తమతో పాటూ కిలోన్నర బంగారు కడ్డీలు తీసుకెళ్లారు. విపరీతమైన ఖర్చులు, కొంత బంగారాన్ని చెలమణీ నుంచి తొలగించడం, ఆర్ధిక వ్యవస్థలో చేసిన మార్పులు చివరికి అతడిని పేదవాడిగా మార్చేసింది.