టేస్టీగా బీట్‌రూట్ చపాతి, ఎంత ఆరోగ్యమో

బీట్‌రూట్ తరుగు - ముప్పావు కప్పు
గోధుమపిండి - ఒకటిన్నర కప్పు
వెల్లుల్లి రెబ్బలు - రెండు
అల్లం - చిన్న ముక్క

నూనె - రెండు స్పూనులు
పచ్చి మిర్చి తరుగు - ఒక స్పూను
నెయ్యి - ఒక స్పూను
ఉప్పు - రుచికి సరిపడా
మిరియాలు - నాలుగు

బీట్రూట్ ముక్కలను వేయించాలి. అందులో ఉప్పు, మిరియాలు, అల్లం, పచ్చిమిర్చి, వెల్లుల్లి వేసి వేయించాలి.

అన్నింటినీ మెత్తని పేస్టులా చేసుకోవాలి.

ఇప్పుడు చపాతీపిండిని కలుపుకునేటప్పుడు బీట్రూట్ ప్యూరీని కూడా వేసి మెత్తగా కలిపేయాలి.

20 నిమిషాల గాలి తగలకుండా పిండిని పక్కన పెట్టాలి.

ఇప్పుడు చపాతీలుగా ఒత్తుకుని కాల్చుకోవాలి.

అంతే బీట్ రూట్ చపాతీ రెడీ అయినట్టే.