కండోమ్‌లు ఎందుకు ఉపయోగిస్తారో మీకు తెలిసిందే. కానీ పశ్చిమ బెంగాల్ విద్యార్థులు కండోమ్‌లను మరోలా వాడుతున్నారు. కండోమ్‌లను నీటిలో వేసి ఉడికించి, ఆ నీరు తాగేస్తున్నారు. ఛీ.. యాక్, అదేం పని అని అనుకుంటున్నారా? ఇందుకో కారణం ఉంది. మార్కెట్లో వివిధ సువాసనలు వెదజల్లే కండోమ్‌లు లభిస్తున్నాయి. ఆ వాసనల కోసం కండోమ్‌లకు ఆల్కహాల్ పూస్తారు. కండోమ్‌లను వేడి నీటిలో ఉడికిస్తే ఆల్కహాల్ బయటకు వస్తుంది. ఆ నీటిని తాగితే కిక్కు వస్తుంది. సుమారు 12 గంటలు మత్తులో ఉంటారు. ఇటీవల పశ్చిమ బెంగాల్‌లో కండోమ్‌లు అధికంగా అమ్ముడవుతున్నాయి. ఓ మెడికల్ షాప్ యజమానికి అనుమానం రావడంతో ఇది బయటపడింది. Images & Video Credit: Pexels