నోరూరించేలా చికెన్ మసాలా ఫ్రై

చికెన్ ముక్కలు - అరకిలో
అల్లం వెల్లుల్లి పేస్టు - ఒక స్పూను
గరం మసాలా పొడి - అర స్పూను
ఉల్లితరుగు - పావు కప్పు
పచ్చిమిర్చి - ఒక స్పూను

కారం - ఒక స్పూను
ధనియాల పొడి - ఒక స్పూను
కరివేపాకులు - గుప్పెడు
నూనె - నాలుగు స్పూన్లు
ఉప్పు - రుచికి సరిపడా
కొత్తిమీర తరుగు - రెండు స్పూన్లు

కళాయిలో నూనె వేసి వేడెక్కాక పచ్చిమిర్చి, ఉల్లిపాయల తరుగు వేసి వేయించాలి.

అల్లం వెల్లుల్లి పేస్టు వేసి వేయించాలి.

చికెన్ ముక్కలు, ఉప్పు వేసి బాగా కలపాలి.

చికెన్ ముక్కల్లో నీళ్లు ఇంకిపోయే దాకా ఉడికించాలి.

నీరు ఇంకిపోయాక ధనియాలపొడి, కారం, పసుపు, కరివేపాకులు వేసి వేయించాలి.

గరంమసాలా కూడా వేసి బాగా కలపాలి.

చిన్న మంట మీద వేయిస్తే చికెన్ మసాలా వేపుడు రెడీ, కొత్తిమీర చల్లుకుని లాగించడమే.