కడుపు నిండా తిన్న తర్వాత పెద్ద పెద్ద పనులు చేయొద్దని పెద్దలు చెబుతారు.

పెద్ద పనులే కాదు, కొన్ని సాధారణ అలవాట్లు కూడా మనకు కీడు చేస్తాయి. అవేంటో చూడండి.

భోజనం చేసిన తర్వాత పండ్లు తినొద్దు. దానివల్ల జీర్ణ సమస్యలు వస్తాయి.

భోజనం తర్వాత స్మోకింగ్ చేయొద్దు. దాని వల్ల పెద్ద పేగు వ్యాధులు వస్తాయి.

భోజనం తర్వాత నిద్రపోతే జీర్ణం కోసం విడుదలయ్యే యాసిడ్స్.. గుండె మంటకు కారణమవుతాయి.

భోజనం తర్వాత స్నానం చేస్తే శరీరం చల్లబడి.. జీర్ణక్రియకు ఎక్కువ శక్తి అవసరమవుతుంది.

ఆహారం తిన్న తర్వాత వ్యాయామాలు చేకూడదు. వాంతులు, జిగట విరోచనాలు అవుతాయి.

భోజనం తర్వాత టీ, కాఫీలు వద్దు. వాటిలోని ఫినోలిక్ సమ్మేళనాలు ఐరన్‌ను శోషణకు ఆటంకం కలిగిస్తాయి.

భోజనం చేసిన తర్వాత బెల్ట్ కాస్త వదులు చేసుకోవాలి. లేకపోతే జీర్ణక్రియ, గ్యాస్ సమస్యలొస్తాయ్.

ఆహారం తిన్నవెంటనే నీళ్లు తాగితే కడుపులో ఎంజైమ్స్, రసాల స్రావం తగ్గిపోతుంది.

భోజనం తర్వాత నీళ్లు తాగితే కడుపు ఉబ్బరం సమస్యలు వస్తాయి. జీర్ణక్రియ కష్టమవుతుంది.

Images & Videos: Pexels