మీకు సాంబారు అంటే ఇష్టమా? డోన్ట్ వర్రీ.. సాంబరు ఆరోగ్యానికి మంచిదే.

ఔనండి, ఈ రోజుల్లో మార్కెట్లో లభిస్తున్న పిజ్జా, బర్గర్లతో పోల్చితే సాంబర్ అత్యుత్తమం.

ఎందుకంటే సాంబర్‌లో క్యాన్సర్‌ను నివారించే కారకాలు ఉన్నాయట.

ఈ విషయాన్ని పరిశోధకులే స్వయంగా వెల్లడించారు.

దక్షిణాది వంటకమైన ‘సాంబారు’.. పెద్ద ప్రేగు క్యాన్సర్‌‌ను నియంత్రిస్తుందట.

దేశంలో పెద్ద ప్రేగు క్యాన్సర్‌ బాధితుల్లో దక్షిణాది ప్రజలే తక్కువట.

ఉత్తరాదిలో సుమారు 70 శాతం మంది పెద్ద పేగు క్యాన్సర్‌తో బాధపడుతున్నారట.

దీంతో సాంబరు వల్లే దక్షిణాది ప్రజల్లో ఆ క్యాన్సర్ సమస్యలేదని భావిస్తున్నారు.

సాంబారులో క్యారెట్, బెండ, దొండ, మునగకాయలు, టమోటాలు, వంకాయలు వేస్తారు.

దనియాలు, వెల్లులి, పసుపు, మిరియాలు, కొత్తిమీర, కరివేపాకు, జీలకర్ర, ఎండి మిర్చి వేస్తారు.

సాంబరులో ఉండే ఆ పోషకాల వల్ల శరీరానికి ఫైబర్, క్యాన్సర్ గడ్డలను నియంత్రించే శక్తి లభిస్తుంది.

సాంబారులో వాడే మసాలాలకు క్యాన్సర్ అడ్డుకునే శక్తి ఉందని మణిపాల్ యూనివర్శిటీ పరిశోధకులు తెలిపారు.

సాంబరు వల్ల జీర్ణక్రియ మెరుగవుతుంది, రోగ నిరోధక శక్తి పెరుగుతుంది.

Images Credit: Pixabay, Pexels, Unsplash, Twitter and Instagram