దోమ కుడితే దురద ఎందుకు వస్తుంది? ఈ లక్షణాలు కనిపిస్తే ప్రమాదం! మన శరీరంలోని వేడికి దోమలు ఆకర్షితం అవుతాయి. దోమలు, కీటకాలు కుట్టేప్పుడు మనకు చాలా దురదగా ఉంటుంది. వెంటనే మనకు దోమ కుట్టిన చోట గోకాలనిపిస్తుంది. దోమలు రక్తాన్ని తాగేందుకు సూదిలాంటి మొనను మన శరీరంలోకి గుచ్చుతాయి. ఆ సమయంలో అవి మీ చర్మంలోకి లాలాజలాన్ని ఇంజెక్ట్ చేస్తాయి. మీ శరీరం వాటి లాలాజలానికి ప్రతిస్పందిస్తుంది. కుట్టిన చోట గడ్డ ఏర్పడి, దురద వస్తుంది. ఒక్కోసారి దోమలు లేదా కీటకాల లాలాజటం విషపూరితం కూడా కావచ్చు. తల తిరగడం, వికారం లేదా జ్వరం వస్తాయి. కొందరు అలర్జీకి గురవ్వుతారు. మీలో అలాంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే డాక్టర్‌ను సంప్రదించండి. Images & Video Credit: Pixabay and Pexels