ఈ దేశాలకు వెళితే అయ్యే ఖర్చు రూ.50వేలలోపే విదేశీ ట్రిప్పులు వేస్తే లక్షలు ఖర్చవుతుందని అనుకుంటారంతా. రూ.50,000 చూసొచ్చే దేశాలు ఇవిగో. వియత్నాం - ఈ దేశంలో రూపాయికి విలువెక్కువ. 50 వేల రూపాయలతో మీరు దేశాన్ని చుట్టి వచ్చేయచ్చు. మాల్దీవులు - ఒక వ్యక్తికి యాభైవేల రూపాయలు ఈ దేశాన్ని చూసేందుకు సరిపోతాయి. థాయిలాండ్ - స్పాలు, పురాతన దేవాలయాలు చూసి వచ్చేందుకు సరైన డెస్టినేషన్. తైవాన్ - నైట్ మార్కెట్లకు కేరాఫ్ అడ్రెస్ తైవాన్. సింగపూర్- ఇది ఖరీదైన దేశమే, అయినా యాభైవేలతో తిరిగి రావచ్చు. నేపాల్ - కళ్లు చెదిరే అందం ఈ దేశం సొంతం. మలేషియా - రూ.35 వేలతోనే ఈ దేశంలో తిరిగి రావచ్చు. కాంబోడియా - ప్రాచీనదేవాలయాల సముదాయాలు కనుల పండువలా ఉంటాయిక్కడ.