బొంగులో ఉప్పు ఎంత ఖరీదో తెలుసా?

కేజీ ఉప్పు ఇరవై రూపాయలకు వచ్చేస్తుంది. అంత తక్కువ ధర.

ప్రపంచంలోనే అతి ఖరీదైన ఉప్పు ఉంది.దాన్ని కొనాలంటే మాత్రం మధ్యతరగతి వారు తమ నెలజీతాన్ని ఖర్చుపెట్టాల్సిందే.

పేరు ‘బాంబూ సాల్ట్’. తెలుగులో వెదురు ఉప్పు అని పిలుచుకోవచ్చు.

ఈ ఉప్పు కిలో ధర రూ.30,000 దాకా ఉంటుంది.

బాంబూ చికెన్, బాంబూ బిర్యానీలాగే బాంబూ ఉప్పు కూడా చాలా స్పెషల్.

ఇది కొరియన్ వంటకాల్లో చాలా ప్రత్యేక స్థానాన్ని కలిగి ఉంది.

వెదురు బొంగుల్లో సముద్రపు ఉప్పును నింపి అనేక సార్లు కాలుస్తారు.

అలా కాల్చడం వల్ల ఉప్పు రంగు కూడా మారుతుంది.

ఆ ఉప్పు వల్ల ఎన్నో ఆరోగ్యప్రయోజనాలు ఉన్నాయి.