ఏడుపు వల్ల ఎన్ని లాభాలో



ఏడ్చే వాళ్లని పిరికివాళ్లు అనుకుంటారు కానీ, ఏడవకపోతే నిజంగానే మానసికంగా బలహీనులు అవుతారు.



కన్నీళ్లు వచ్చే సందర్భాల్లో మీరు ఏడుపును బలవంతంగా ఆపుకోవడం వల్ల మానసిక ఆరోగ్యం మరింతగా దిగజారుతుంది.



మిమ్మల్ని మీరు మరింత బలంగా మార్చుకోవాలంటే ఏడవాల్సిందే.



మీ భావోద్వేగాలు, ఒత్తిడి బయటికి పోవాలంటే ముఖ్యమైన పని ఏడవడమే.



బాధ లేదా చేదు గాయం తాలూకు మానసిక క్షోభ బయటికి పోతేనే ఏదైనా బాధ పోతుంది. అలా పోవాలంటే ఏడవాలి.



ఏడుపు ద్వారా బాధ బయటికి పోతే గుండె, మెదడు ఆరోగ్యాన్ని కాపాడతాయి.



కన్నీళ్లతో పాటూ కళ్లలో ఉన్న దుమ్మూ ధూళి, టాక్సిన్లు కూడా తొలగిపోతాయి.



ఒత్తిడి,డిప్రెషన్ వంటివి త్వరగా తొలగిపోతాయి.