మీ భార్య మీతోపాటు విహార యాత్రకు రాకపోతే ఏం చేస్తారు? ఏం చేస్తాం, (మనసులో సంతోషిస్తూ..) ఒంటరిగానే వెళ్లి వచ్చేస్తాం అంటారు కదా. అయితే, అతడు మాత్రం అలా చేయలేదు. పెళ్లానికి బదులు పిల్లోను తీసుకెళ్లడు. ఆ దిండుపై భార్య ఫొటోను ప్రింట్ చేసి మరీ విహారయాత్రలో తిప్పాడు. ఆఖరి క్షణంలో అతడి భార్య టూర్‌ను రద్దు చేసుకోవడంతో అతడు ఇలా చేశాడు. ‘‘తనతో మాత్రమే టూర్‌కు వెళ్తానని నా భార్యకు మాటిచ్చా. అందుకే ‘దిండు’లా తీసుకొచ్చా’’ అన్నాడు. చివరికి ఎయిర్‌పోర్ట్‌లో ఆ దిండుకు కోవిడ్-19 పరీక్షలు చేయించాడు. ఈ ఫొటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా చక్కర్లు కొడుతున్నాయి. భార్యంటే గిట్టనివారు.. వీడు చాలా ఓవర్ చేస్తున్నాడని కామెంట్ చేస్తున్నారు. అన్నట్టు, ఆ మహానుభావుడి పేరు రేమండ్ ట్యాన్ ఫొర్ట్యూనడో, ఫిలిప్పీన్స్‌లో నివసిస్తున్నాడు. Images Credit: Raymond Tan Fortunado/Facebook