రక్తపోటు తగ్గినప్పుడు వెంటనే ఇలా చేయండి అధికరక్తపోటులాగే అల్ప రక్తపోటు వల్ల కూడా సమస్యలు వస్తాయి. రక్తపోటు తక్కువగా ఉండడాన్ని హైపో టెన్షన్ అంటారు. రక్తపోటు తక్కువైతే కళ్లు తిరగడం, అలసట, మసకగా కనిపించడం, వికారం అనిపిస్తుంది. ఇలా అనిపించగానే గ్లాసుడు నీళ్లు తాగేయాలి. కింద పడుకుని కాళ్లు పైకి ఎత్తాలి. దీని వల్ల రక్త ప్రసరణ గుండెకు సజావుగా జరుగుతుంది. నీళ్లలో కాస్త ఉప్పు కలుపుకుని తాగినా వెంటనే రికవరీ అవుతారు. కాళ్లు సున్నితంగా నొక్కడం వల్ల కాళ్ల నుంచి గుండెకు రక్త ప్రసరణ జరుగుతుంది. లక్షణాలు తగ్గుతాయి. లోబీపీ మరీ తక్కువగా ఉండడం లేదా ఇలా తరచూ కళ్లు తిరుగుతుండడం, వికారం వంటివి ఉంటే మాత్రం కచ్చితంగా వైద్యుడిని కలవాలి.