రష్మిక మందన్న ఇష్టంగా తినేవి ఇవే రష్మిక వెజిటేరియన్. మొక్కల ఆధారిత ఆహారాన్నే తింటుంది. బయటి ఫుడ్ కన్నా ఇంటి దగ్గర వండే ఆహారాన్నే ఇష్టపడుతుంది. ఆమె ఫుడ్ ప్లేటులో చిలగడదుంపలు, సీజనల్ పండ్లు కచ్చితంగా ఉంటాయి. రష్మిక అన్నాన్ని తినేందుకు ఇష్టపడదు. ఉదయం లేవగానే గ్లాసు వేడినీళ్లలో ఆపిల్ సిడర్ వెనిగర్ కలుపుకుని తాగుతుంది. రష్మికకు కీరాదోస, బంగాళాదుంపలు, క్యాప్సికమ్, టమాటోలంటే అలెర్జీ. బాదం, వాల్‌నట్స్, జీడిపప్పు వంటివి తింటుంది. శని, ఆదివారాల్లో మాత్రం ఏదో ఓసారి చీట్ మీల్ తింటుంది. అంటే పిజ్జాలు, బర్గర్లు వంటివి లాగించేస్తుంది.