ఆల్కహాల్ మానేస్తే ఏమవుతుందంటే.... ఆల్కహాల్ మానివేయడం వల్ల తూగి కిందపడి దెబ్బలు తగిలించుకోవడం తగ్గుతుంది. అధికరక్తపోటు కంట్రోల్ అవుతుంది. ట్రైగ్లిజరైడ్స్ పెరగకుండా అడ్డుకుంటుంది కాలేయం పనితీరు మెరుగుపడుతుంది. లివర్ సిర్రోసిస్, ఫ్యాటీ లివర్ వంటి సమస్యలు రావు. బరువు త్వరగా తగ్గుతారు. ఆల్కహాల్ మానేయడం వల్ల కుటుంబంపై శ్రద్ధ చూపిస్తారు. ప్రేమ, ఆప్యాయతలు పెరుగుతాయి. లైంగిక శక్తి కూడా పెరుగుతుంది. నిద్ర చక్కగా పడుతుంది. జీవితం రిలాక్స్‌గా అనిపిస్తుంది.