వర్షాకాలం వచ్చిందంటే బాగా కాచిన నీళ్లు తాగాలని చెబుతుంటారు. ఔను, ఈ సీజన్లో గోరు వెచ్చని నీళ్లు తాగడం ఆరోగ్యానికి మంచిదే. కానీ, ఆ నీటిని కాసేపు మరిగిస్తే సరిపోదు. కనీసం 20 నిమిషాలు మరిగిస్తేనే సురక్షితం. నీటిని బాగా మరిగిస్తేనే అందులోని బ్యాక్టీరియా, సూక్ష్మజీవులు తొలగిపోతాయి. నీటిని కాసేపే మరిగిస్తే.. సీసం, ఆర్సెనిక్, మెగ్నీషియం, నైట్రేట్ వంటి మలినాలను పోవు. వాటిని సుద్ధి చేయాలంటే RO నుంచి UV వాటర్ ప్యూరిఫైయర్‌లు అవసరం. కాచిన నీటి కంటే ప్యూరిఫై చేసిన తాగు నీరే సురక్షితం అనే వాదన ఉంది. కానీ, ప్యూరిఫై చేసిన వాటర్‌లో మనకు అవసరమైన లవణాలు ఉండవని చెబుతారు. కాచిన నీరు లేదా ప్యూరిఫై వాటర్ వీటిలో ఏది మంచిదా అంటే.. రెండూ మంచివే. కానీ, ఈ వర్షాకాలంలో కుళాయిలు, బోరింగులు, పైపుల నుంచి వచ్చే వాటర్ నేరుగా తాగడం అస్సలు మంచిది కాదు. Images & Videos Credit: Pexels