తలపై దురద తగ్గాలా? ఇలా చేయండి కొందరికి తలపై దురద అధికంగా పెడుతుంది. మాడు అపరిశుభ్రంగా, చుండ్రు అధికంగా ఉన్నా కూడా దురద అధికమవుతుంది. దురద తగ్గాలన్నా, జుట్టు బాగా పెరగాలన్నా ఈ చిట్కాలు పాటించండి. టీ ట్రీఆయిల్‌లో కొబ్బరి నూనె కలిపి తలకు పట్టిస్తూ ఉండాలి. కొబ్బరినూనె చర్మానికి మాయిశ్చరైజ్ చేస్తుంది. తలకు తరచూ పట్టిస్తూ ఉండాలి. కలబంద రసం జుట్టుకు పట్టిస్తే చుండ్రు పోతుంది. దురద తగ్గుతుంది. పెరుగును జుట్టుకు, మాడుకు పట్టించి తలకు స్నానం చేయాలి. గుడ్డులోని సొన మాడుకు పట్టించడం వల్ల హెయిర్ ఫోలికల్స్ బలంగా మారుతాయి.