కళ్లముందు ఇష్టమైన పదార్థాలు కనిపిస్తే ఆపుకోవడం కాస్త కష్టమే. కానీ, ఆయుర్వేదం ప్రకారం కొన్ని ఆహారాలను అస్సలు కలిపి తినకూడదు. దాని వల్ల వికారం, కడుపు నొప్పి, ఉబ్బరం, అలసట వంటి సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది. థైరాయిడ్ బాధితులు క్యాబేజీ, క్యాలీఫ్లవర్, బ్రకొలి వంటి అయోడిన్ రిచ్ ఫుడ్స్‌తో కలిపి తినకూడదు. పాలు, చేపలు వంటి పదార్థాలను కూడా కలిపి తీసుకోకూడదు. విటమిన్-సి ఎక్కువగా ఉండే పుల్లని పదార్థాలను పాలతో కలిపి తీసుకోకూడదు. విటమిన్-సి అధికంగా ఉండే బచ్చలి కూర, నిమ్మకాయ, ఆరెంజ్, బెర్రీల్లో యాసిడ్స్ ఎక్కువ. విటమిన్-సి పదార్థాలతో పాలని కలిపి తీసుకుంటే గ్యాస్, గుండెల్లో మంట తదితర సమస్యలు వస్తాయ్. భోజనంతోపాటు ఎలాంటి పండ్లు తినకూడదు. తినే భోజనం జీర్ణం కావడానికి టైమ్ పట్టేస్తుంది. టీతో కలిపి నట్స్, ఆకు పచ్చని కూరలు, తృణ ధాన్యాలు తీసుకోవద్దు. Images & Video Credit: Pexels