అరటిపండ్ల అట్లు రెసిపీ... అదిరిపోతుంది



పిల్లల కోసమే ప్రత్యేకమైన బ్రేక్ ఫాస్ట్ రెసిపీ ఇది.

అరటి పండ్లు - రెండు
గోధుమపిండి - ఒక కప్పు
పాలు - అరకప్పు
నెయ్యి - ఒక స్పూను
తేనె - రెండు స్పూనులు

మిక్సీలో అరటిపండ్ల ముక్కలు, పాలు వేసి మెత్తటి పేస్టులాగా చేసుకోవాలి.

ఒక గిన్నెలో ఆ మెత్తటి పేస్టును వేసి అందులో తేనె, గోధుమపిండి వేసి కలపాలి.

అట్లులా పోసుకోవడానికి వీలుగా జారేలా వచ్చేలా గోధుమపిండిని కలుపుకోవాలి.

అవసరం అయితే పాలు లేదా నీళ్లు కలుపుకోవచ్చు.

ఇప్పుడు పెనంపై కాస్త నెయ్యి రాసి అట్లులా పోసుకోవాలి.

రెండు వైపులా బంగారు రంగు వర్ణంలోకి వచ్చేలా కాలాక తీసి పిల్లలకు పెట్టండి.