చాలామంది ఆహారంలోని అల్లాన్ని పక్కన పెట్టేస్తారు. అల్లం ఘాటుగా, చేదుగా ఉండటమే ఇందుకు కారణం. ఆరోగ్యంగా ఉండాలంటే రోజూ ఆపిల్ తినక్కర్లేదు. అల్లం తింటే చాలని మన ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. అల్లంలో బోలెడన్ని ఔషద గుణాలున్నాయి. అల్లం తలనొప్పి, జలుబు నుంచి ఉపశమనం కలిగిస్తుంది. కడుపులో గ్యాస్ ఫామ్ అయి ఇబ్బందిగా అనిపిస్తే కొద్దిగా అల్లం ముక్క నమిలితే ఉపశమనం లభిస్తుంది. అల్లం క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది, గొంతు నొప్పి నుంచి ఉపశమనం కలిగిస్తుంది. అల్లంలో యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉన్నాయి. అవి క్యాన్సర్, హార్ట్ స్ట్రోక్ నుంచి రక్షిస్తాయి. యాంటీఆక్సిడెంట్లు ఫ్రీ రాడికల్స్‌ను స్థిరీకరించి, ఆక్సీకరణ ఒత్తిడిని నివారిస్తాయి. కడుపు ఉబ్బరంగా ఉంటే కొద్దిగా అల్లం ముక్క నోట్లో వేసుకుంటే చాలు. అల్లంలోని జింజెరాల్స్ వికారం, అజీర్ణం వంటి కడుపు సమస్యలు లేకుండా చేస్తుంది. అల్లం రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రిస్తుంది. మధుమేహంతో బాధపడే వారికి అల్లం గొప్ప ఔషధం. Images & Video Credit: Pexels, Pixabay and Unsplash