బియ్యపు నీళ్లతో ఇలా చేస్తే జుట్టు పెరుగుతుంది జుట్టు పొడవుగా, అందంగా ఉండాలని ఏ అమ్మాయి మాత్రం కోరుకోదు? కానీ జుట్టు ఊడిపోవడం, కళా విహీనంగా మారడం ఇప్పుడు పెద్ద సమస్యగా మారింది. జుట్టును కాపాడుకోవాలంటే కొన్ని చిట్కాలు తెలుసుకుని పాటించాల్సిందే. అందులో ఒకటి బియ్యం నీళ్లు. ఓ పిడికెడు బియ్యం ఒక గిన్నెలో నీరు వేసి నానబెట్టాలి. కొన్ని గంటల పాటూ నానబెట్టి వడకట్టి ఆ నీటిని పన్నెండుగంటల పాటూ పక్కనపెట్టాలి. ఆ తరువాత ఒక స్ప్రే బాటిల్ లో వేసి దాచుకోవాలి. తలకు స్నానం చేశాక చివర్లో ఈ బాటిల్ తో నీటిని స్ప్రే చేయాలి. మాడుకు తగిలేలా చల్లుకోవాలి. అయిదు నిమిషాల తరువాత సాధారణ నీటితో కడిగేసుకోవాలి. ఇలా వారానికి రెండు సార్లు చేస్తే జుట్టు బాగా పెరుగుతుంది.