కరీనాకపూర్ ఎంత రిచ్ అంటే... బాలీవుడ్ స్టార్ హీరోయిన్లలో కరీనాకపూర్ ఒకరు. ఆమె ఎంత ధనవంతురాలో చెప్పాలంటే ఆమెకున్న ఆస్తుల గురించి చెప్పాలి. ముంబైలోని బాంద్రాలో ఆమెకు రూ.25 నుంచి రూ.30 కోట్ల వరకు ఉంటుంది. స్విట్జర్లాండ్‌లో ఒక ఇల్లు ఉంది. దాని విలువ రూ.33 కోట్లు. ఆమె దగ్గర అయిదు క్యారెట్ల వజ్రాన్ని పొదిగిన ఉంగరం ఉంది. దాని విలువ చాలా ఎక్కువ. మెర్సిడెస్ బెంజ్ ఎస్ క్లాస్, ఆడి క్యూ7, ల్యాండ్ రోవర్ రేంజ్ రోవర్ స్పోర్ట్ కార్లు ఆమె గ్యారేజీలో ఉన్నాయి. ఆమె దగ్గర ఖరీదైన హ్యాండ్ బ్యాగులు ఉన్నాయి. ఒక హ్యాండ్ బ్యాగు ఖరీదు రూ.13 లక్షలు. ఆమె దగ్గర ఇంకా ఎన్నోK ఖరీదైన జ్యూయలరీ ఉంది.