సెల్ఫిష్ వ్యక్తులు(స్వార్థపరులు) తమ స్వార్థం కోసం ఏమైనా చేస్తారు. ఈ లక్షణాలను బట్టి వారిని గుర్తించవచ్చు. పక్కవారికి ఏమైనా పర్వాలేదు. తమ అవసరాలు తీరిపోతే చాలనట్లుగా ప్రవర్తిస్తారు. తమకు కావల్సినది సాధించడం కోసం మానిప్యులేషన్ చేసి, తప్పుదారి పట్టిస్తారు. వీరికి వస్తు, ధన దాహం ఎక్కువ. అనుమతిలేకుండానే ఇతరుల వస్తువులు వాడేస్తారు. సెల్ఫిష్ వ్యక్తులు తమని తాము ప్రమోట్ చేసుకుంటారు. పనంతా తానే చేస్తున్నట్లు బిల్డప్ ఇస్తారు. వీరికి ఇతరులపై జాలి చూపడం తెలీదు. ఎలాంటి భావోద్వేగాలు ఉండవు. తమ పనుల వల్ల తోటివారికి నష్టం కలుగుతుందని తెలిసినా, గుడ్డిగా చేసుకుని పోతారు. తమకు కావల్సినదాని కోసం అసత్యలు, దాడులు, వీలైతే నేరాలు చేయడానికి కూడా వెనకాడరు. ఇతరుల ఫీలింగ్స్‌ను వీరు అర్థం చేసుకోలేరు. చాలా మూర్ఖంగా ఉంటారు. ఇతరులను తమ చేతుల్లో ఉంచుకుని, వారి జీవితాన్ని కంట్రోల్ చేయాలని అనుకుంటారు. వీరు చాలా నిర్లక్ష్యంగా ఉంటారు. వారి తప్పిదాల వల్ల కలిగే పరిణామాలపై ఆలోచించరు. వీరికి పశ్చాతాపం అనేది ఉండదు. తాము చేసిందే కరెక్ట్ అని భావిస్తారు. తమని తాము బాస్‌గా భావిస్తారు. అన్నీ తాము చెప్పినట్లే జరగాలనుకుంటారు. Images & Videos Credit: Pexels