తెల్లవారుజామునే లేస్తే ఎన్ని లాభాలో చాలా మంది ఆలస్యంగా పడుకుని ఉదయం లేటుగా లేస్తారు. అధ్యయనాల ప్రకారం రాత్రి త్వరగా పడుకుని తెల్లవారుజామున లేవడం చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ఉదయానే లేవడం వల్ల రాత్రి త్వరగా పడుకుంటారు. దీని వల్ల నిద్రాసైకిల్ చక్కగా పనిచేస్తుంది. సరిపోయినంత నిద్ర పోవడం వల్ల ఒత్తిడి స్థాయిలు తగ్గుతాయి. మనసు ప్రశాంతంగా ఉంటుంది. మూడ్ ఉల్లాసంగా, ఉత్సాహంగా ఉంటుంది. మెదడు చాలా చక్కగా పనిచేస్తుంది. శరీరం శక్తిమంతంగా తయారవుతుంది.