ఈ ఆరోగ్యసమస్యలు ఉండే కాఫీ తాగొద్దు

కాఫీ అంటే ఎంతో మందికి ప్రాణం. టీ కన్నా కాఫీకే డిమాండ్ ఎక్కువ.

కానీ కొన్ని సమస్యలు ఉన్న వారు కాఫీని తాగకూడదు.

అరిథ్మియా అనే గుండె సమస్య ఉన్న వారు కాఫీని దూరం పెట్టాలి.

గర్భిణులు కాఫీ అతిగా తాగడం వల్ల గర్భస్రావం కావడం లేదా, ముందస్తు ప్రసవ ప్రమాదం పెరుగుతుంది.

పాలిచ్చే తల్లులు కాఫీని తాగడం వల్ల వారి శరీరం డీహైడ్రేషన్‌కు గురవుతుంది.

కెఫీన్ వల్ల మూత్రవిసర్జన పెరుగుతుంది. మూత్ర విసర్జనలో నీళ్లు అధికంగా బయటికి పోతాయి.

అందుకే అతిగా కాఫీ తాగడం వల్ల డీ హైడ్రేషన్ సమస్య పెరిగిపోతుంది.

నిద్రలేమి వంటి నిద్ర సంబంధిత సమస్యలతో ఉన్నవారు కూడా కాఫీని దూరం పెట్టాలి.