కమలం (Lotus) ఏ దేశాల జాతీయ పుష్పం

Published by: Shankar Dukanam

కమలం పోరాటానికి ఒక ఉదాహరణ. ఇది అన్ని పువ్వులలో ప్రత్యేకమైనదిగా భావిస్తారు. ప్రజలు దీనిని వివిధ కారణాలతో ప్రత్యేకంగా భావిస్తారు.

కమలం తన అందం, పవిత్రత, నిబద్ధతకు భారతదేశంలోనే కాకుండా అనేక ఇతర దేశాలలోనూ జాతీయ పుష్పం. ఏయే దేశాల జాతీయ పుష్పంగా ఉందో చూద్దాం.

భారతదేశంతో పాటు వియత్నాం, ఈజిప్ట్, బంగ్లాదేశ్ లకు నేషనల్ ఫ్లవర్. కమలం ప్రత్యేకత ఏమిటంటే ఇది బురదలో పెరిగినా, పరిశుభ్రంగా, అందంగా ఉంటుంది.

భారతదేశంలో దీనిని కళ, సంస్కృతి, ధర్మంలో పవిత్రత, జ్ఞానానికి చిహ్నంగా భావిస్తారు. అయితే వియత్నాం, ఈజిప్ట్, బంగ్లాదేశ్ లలో దీని ప్రాముఖ్యత ఉంటుంది.

వియత్నాంలో కమలాన్ని దాని స్వచ్ఛతగా భావిస్తారు. బురద నుంచి పైకి లేచి వికసించడం, దృఢంగా పోరాడటం వంటి కారణాలతో ముఖ్యమైనదిగా భావిస్తారు.

ఈజిప్టులో నీలి కలువ జాతీయ చిహ్నం. ప్రాచీన ఈజిప్టులో నైలు నది ఒడ్డున పెరిగే కలువను ప్రత్యేకంగా భావిస్తారు.

సూర్యోదయంతో వికసించడం, సాయంత్రం సూర్యాస్తమయంతో క్లోజ్ కావడం వల్ల పురాతన ఈజిప్షియన్లు దీనిని సూర్య దేవుడిగా భావిస్తారు

బంగ్లాదేశ్ లో స్థానిక భాషలో తెల్ల కలువను షప్లా అంటారు. కలువను స్వాతంత్య్ర చరిత్రతో కూడా ముడిపెడతారు

అలాగే బంగ్లాదేశ్‌లో కమలం వ్యాపారం బాగా జరిగేది. స్వాతంత్య్ర ఉద్యమంలో అక్కడి నాయకులు అందర్నీ నడుపుకుని వెళ్లేవారు.