గల్ఫ్‌లో వచ్చిన తుపాను కారణంగా దుబాయ్‌లో వర్షాలు కుమ్మేశాయి.



24 గంటల్లో 80 మిల్లీమీటర్ల వర్షం కురిసింది అంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు.







భూమిపైకి ఒక్కసారిగా సముద్రాలు, నదులు వచ్చి పడినట్టు వరదలు కమ్మేశాయి.



అప్పటి వరకు ఎడారి ప్రాంతంగా ఉన్న దుబాయ్ భారీ వర్షాలకు ఒక్కసారిగా నీట మునిగింది.



ఆఫీస్‌లకు వెళ్లేవాళ్లు. ఆఫీసుల నుంచి వచ్చే వాళ్లు. వేర్వేర్వేరు పనుల కోసం బయటకు వెళ్లే వాళ్లంతా వరదల్లో చిక్కుకున్నారు.



అకస్మాత్తుగా వచ్చిన వరదలకు ఏం చేయాలో తెలియలేదు.



భారీగా ట్రాఫిక్‌ కూడా స్తంభించిపోయింది. అర్థరాత్రి దాటినా ట్రాఫిక్ క్లియర్ కాలేదు.



ప్రపంచంలోనే అత్యంత ధనిక దేశంగా పేరు ఉన్న దుబాయ్‌లో కనిపిస్తున్న దృశ్యాలు ఆశ్చర్యపరుస్తున్నాయి.



బుధవారం కూడా వర్షాలు పడే సూచన ఉన్నందున ప్రజలు ఆఫీస్‌లకు రావద్దని ఇంటి నుంచే పని చేయాలని ప్రభుత్వం సూచించింది.



అత్యవసరమైతే తప్ప ఎవరూ బయటకు రావద్దని చెబుతోంది. వానాలు సురక్షిత ప్రదేశాల్లో పార్క్ చేయాలని హెచ్చరిస్తోంది.



దుబాయ్‌తోపాటు షార్జా, అజ్మాన్, రస్‌ అల్‌ ఖైమా, ఉమ్ అల్‌ ఖువైన్, పుజైరాలో కూడా వర్షాలు కుమ్మేశాయి.



జనం బయటకు రావడానికి భయపడేంత వానలు పడ్డాయి.



దుబాయ్‌లో ఉన్న వారు పెట్టే వీడియోలు, ఫొటోలు సోషల్‌ మీడియా తెగ వైరల్ అవుతున్నాయి.



దుబాయ్‌తోపాటు అబుదాబిలో కూడా వర్షాలు కురిశాయి. వర్షంతోపాటు వడగళ్లు కూడా కురిశాయి.