సౌత్ కొరియాలో కొత్త Age Counting System అందుబాటులోకి వచ్చింది. ఈ సిస్టమ్ ప్రకారం దేశంలోని పౌరులందరి వయసు ఒకటి లేదా రెండేళ్ల పాటు తగ్గిపోనుంది. పాత విధానం ప్రకారం సౌత్ కొరియాలో పుట్టిన వెంటనే వాళ్ల వయసుని ఏడాదిగా పరిగణిస్తారు. పాత విధానం వల్ల సౌత్ కొరియన్ ప్రజల వయసు లెక్కింపులో చాలా కన్‌ఫ్యూజన్స్ తలెత్తాయి. ఇకపై బిడ్డ పుట్టినప్పుడు వయసుని సున్నాగా పరిగణించి 12 నెలలు గడిచాకే ఏడాది అని లెక్కించనుంది సౌత్ కొరియా. గతేడాది డిసెంబర్‌లో ఏజ్ కౌంటింగ్ సిస్టమ్‌లో సవరణలకు ఆమోదం తెలిపింది ప్రభుత్వం. వయసు లెక్కింపులో కన్ఫ్యూజన్‌కి తావులేకుండా కొత్త విధానం అనుసరించనున్నట్టు సౌత్ కొరియా ప్రకటించింది. 86% మంది కొత్త ఏజ్ కాలిక్యులేషన్ సిస్టమ్‌పై సంతృప్తితో ఉన్నారు. (Images Credits:Pixabay)