భూకంపాలకు కారణం భూమి పొరల్లోని కదలికలే. వాటి వల్లే ఉపరితలంపై విధ్వంసం జరుగుతుంది. మన దగ్గర చాలా అరుదు కానీ, కొన్ని దేశాల్లో సంవత్సరానికి కొన్ని వందల భూకంపాలు వస్తుంటాయి. ఎక్కువగా భూకంపాలు, ప్రకంపనలు సంభవించే తొలి ఐదు దేశాలు ఇవీ.. జపాన్‌లో భూకంపాలు, సునామీలు అధికంగా వస్తాయి. ‘రింగ్ ఆఫ్ ఫైర్’ ప్రాంతంలో ఈ దేశం ఉంటుంది. రింగ్ ఆఫ్ ఫైర్ ప్రాదేశిక స్థలంలో 40 వేల కి.మీ. మేర చలనశీల టెక్టానిక్ ప్లేట్‌లు ఉన్నాయి. ఫిలిప్పీన్స్ కూడా రింగ్ ఆఫ్ ఫైర్‌కు దగ్గర్లోనే ఉంది. ఇక్కడ అగ్నిపర్వతాలు పేలడం కూడా ఎక్కువే. ఇండోనేసియాలో చిన్న, మధ్య స్థాయి భూకంపాలు సర్వసాధారణం. అత్యంత సున్నితమైన ప్రదేశంలో ఇండోనేసియా ఉంటుంది. ఈక్వెడార్‌లో ఎక్కువగా ఉండే అగ్ని పర్వతాల వల్ల భూకంపాలు, ప్రకంపనల ప్రమాదం చాలా ఎక్కువ. తుర్కియే అనేది యురేషియా, ఆఫ్రికా, అరేబియా అనే మూడు భూఫలకాలపై ఉంది. ఎర్త్ క్రస్ట్ చీలికలపై ఈ దేశ భూభాగం ఉండటంతో భూకంపాలు రావడానికి ఎక్కువ అవకాశాలు. ఇక్కడ 2021లోనే 23,735 భూప్రకంపనలు వచ్చాయి