ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన చేప అట్లాంటిక్ బ్లూఫిన్ ట్యూనా. ఈ చేవ ఖరీదు కోట్లలో ఉంటుంది. అవి టార్పెడో ఆకారాన్ని కలిగి ఉంటాయి. దీని జీవిత కాలం 40 సంవత్సరాలు. ఇది సుమారు 250 కిలోల వరకు బరువు, 3 మీటర్ల పొడవు ఉంటుంది. అంతరించిపోయే దశలో ఉన్నందున కొన్ని దేశాలలో ఈ చేపను పట్టుకోవటం నేరం అట్లాంటిక్ సముద్రంలో ఉండే ఈ చేప గంటకు 70 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది. ఇందులో ప్రొటీన్లు, ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ ఉండటంతో ఔషధాల తయారీలో కూడా ఉపయోగిస్తారు.