రాజస్థాన్ అంటే పెద్ద పెద్ద కోటలకు ఫేమస్.. రాజస్థాన్ లోని కొన్ని ప్రదేశాల్లో దెయ్యాలు తిరుగుతున్నట్లు అక్కడి ప్రజలు చెబుతుంటారు. ఆ ప్రాంతాలు ఇవే. భాన్ ఘర్ ఫోర్ట్.. ఆల్వార్ జిల్లాలోని ఈ కోటలో దెయ్యాలు ఉన్నాయట. కుల్దారా గ్రామం ఒకప్పుడు దైవ భూమి. కానీ, 19వ శతాబ్దంలో గ్రామస్థులు ఆ ఊరిని విడిచి వెళ్లాక.. దెయ్యాల గ్రామంగా మారింది. 1857లో హత్యకు గురైన మేజర్ బుర్టాన్ బ్రిజ్ రాజ్ భవన్ లో ఆత్మగా తిరుగుతున్నాడట. ఇది కోటాలో ఉంది. నహార్ ఘర్.. మహారాజ సవాయి జై సింగ్ - 2 నిర్మించారు. ఆయన ఆత్మ కోటలో ఉందని చెప్తారు. జైపూర్ దగ్గర్లోని జగత్ పురాలో గ్రామస్తులంతా ఆత్మల్లా తిరుగుతున్నారని చెప్తుంటారు. రాజు శాపం వల్ల అలా జరిగిందనేది టాక్. సుధాబే.. పుష్కర్ దగ్గర్లోని ఈ ప్రాంతానికి జనాలు తమలో ఉన్న చెడును తొలగించుకునేందుకు వస్తుంటారు. రణ కుంభా ప్యాలెస్.. ఇక్కడ రాణి పద్మిని, చెలికత్తెలు ఆత్మహత్య చేసుకుని, ఆత్మలుగా తిరుగుతున్నారని చెప్తారు. ఇలాంటి ఇంట్రెస్టింగ్ విషయాల కోసం ‘ఏబీపీ దేశం’ను ఫాలో అవ్వండి.