యాపిల్ కంపెనీ ఉత్పత్తులు ఎంత ప్రత్యేకంగా ఉంటాయో హెడ్ ఆఫీస్ కూడా అంతే ప్రత్యేకం



2017లో నిర్మించిన ఈ హెడ్ క్వార్టర్ ను స్పేస్ షిప్ అని కూడా పిలుస్తారు. అసలు పేరు యాపిల్ పార్క్



కూపర్టినో, కాలిఫోర్నియాలో, శాన్‌ఫ్రాన్సిస్కో నగరానికి సమీపంలో నిర్మాణం



స్పెస్ షిప్ అని ఎందుకు పిలుస్తారో ఆ రూపాన్ని చూస్తే అర్థమైపోతుంది !- 175 ఎకరాల్లో సర్క్యులర్ గా దీన్ని నిర్మించారు.



యాపిల్ పార్క్ మొత్తం ఎకో ఫ్రెండ్లీ - 9వేల చెట్లు ఉంటాయి !



ఉత్తర అమెరికాలో అతిపెద్ద LEED ప్లాటినం-సర్టిఫైడ్ కార్యాలయ భవనం యాపిల్ పార్క్



17-మెగావాట్ల ఆన్‌సైట్ రూఫ్‌టాప్ సోలార్ , నాలుగు మెగావాట్ల బయోగ్యాస్ ఇంధన సెల్‌లు ఉంటాయి



ఆపిల్ పార్క్‌లో సందర్శకుల కోసం విజిటర్ సెంటర్ ఉంది. అక్కడ ఆపిల్ వస్తువులు కొనుగోలు చేయవచ్చు



వర్క్ , ఇన్నోవేషన్ కలయికను ప్రతిబింబించే ఒక అద్భుతమైన ప్రదేశం.



యాపిల్ లాగానే వారి ప్రధాన కార్యాలయాన్ని అంత క్రియేటివ్ గా నిర్మించారు . ఈ ఘనతంతా టిమ్ కుక్‌దే