ప్రపంచ కప్ ఫైనల్లో ఆస్ట్రేలియా, భారత్ జట్లు తలపడనున్నాయి.

ఆదివారం అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో ఈ మ్యాచ్ జరగనుంది.

ఈ మ్యాచ్‌లో స్టీవ్ స్మిత్‌పై ఆస్ట్రేలియా మాజీ ఆటగాడు మైకేల్ బెవాన్ పెద్ద భారాన్ని వేశాడు.

భారత్‌కు విరాట్ కోహ్లీ ఎలా ఆడుతున్నాడో... ఆస్ట్రేలియాకు స్మిత్ అలా ఆడాలని అభిప్రాయపడ్డాడు.

ఈ ప్రపంచ కప్‌లో విరాట్ కోహ్లీ అద్భుతంగా ఆడుతున్నాడు.

711 పరుగులతో టోర్నీ చరిత్రలోనే సింగిల్ ఎడిషన్‌లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా అవతరించాడు.

స్టీవ్ స్మిత్ మాత్రం ఆశించిన స్థాయిలో రాణించడం లేదు.

ఈ టోర్నమెంట్‌లో ఇప్పటి వరకు 298 పరుగులు మాత్రమే చేశాడు.