విరాట్ కోహ్లీ తన క్రికెట్ కెరీర్‌లో ఎన్నో మైలురాళ్లు సాధించాడు. వీటిలో కొన్ని రికార్డులు అందుకోవడం దాదాపు అసాధ్యం. కానీ తన కెరీర్‌లో ఎంతో స్పెషల్ విషయం ఒకటి ఉంది. విరాట్ కోహ్లీకి, అతని జెర్సీ నంబర్ 18కి మధ్య ఒక సంబంధం ఉంది. ప్రతి క్రికెటర్‌కు జెర్సీ నంబర్ ఎంతో ముఖ్యం. అండర్-19 టీమ్‌లో విరాట్ చేరినప్పుడు అతనికి 18వ నంబర్ జెర్సీ ఇచ్చారు. మరోవైపు తండ్రి ప్రేమ్ కోహ్లీ అంటే విరాట్ కోహ్లీకి ప్రాణం. విరాట్ పెద్ద స్టార్ క్రికెటర్ కాకముందే తండ్రి మరణించారు. 2006 డిసెంబర్ 18వ తేదీన కోహ్లీ మరణించారు. దీంతో విరాట్ కోహ్లీ ఎప్పుడూ 18వ నంబర్ జెర్సీని వదల్లేదు.