హ్యూమన్ ఇమ్యూనో డెఫిషియెన్సీ వైరస్(హెచ్ ఐ వి) లేదా ఎయిడ్స్. చికిత్స లేని ప్రాణాంతక వ్యాధి.



దీనికి నివారణ ఒక్కటే మార్గం. అందుకే ఏటా డిసెంబర్ 1వ తేదీన ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవం జరుపుతారు.



ఎయిడ్స్ మీద అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తారు. 1988 లో తొలిసారిగా ఎయిడ్స్ దినోత్సవం జరపాలని నిర్ణయించారు.



ఈ వ్యాధి లక్షణాల్లో మొదటగా కనిపించేది గొంతు నొప్పి, అలసట, జ్వరం, ఫ్లూ.



ఆకస్మికంగా బరువు తగ్గడం కూడా ఎయిడ్స్ ప్రమాదకరమైన సంకేతాల్లో ఒకటి.



రాత్రివేళ చెమటలు బాగా పడతాయి. తరచూ రాత్రి వేళ చెమటలు అధికంగా పడితే ఖచ్చితంగా వైద్యులని సంప్రదించాలి.



హెచ్ ఐ వి పాజిటివ్ ఉండటం వల్ల కండరాల్లో నొప్పి అధికంగా ఉంటుంది.



హెల్త్ లైన్ ప్రకారం జననేంద్రియ భాగాల్లో పుండ్లు తరచూ రావడం ఎయిడ్స్ లక్షణం.



చర్మం మీద ఎప్పుడు దురదగా అనిపిస్తుంది. దద్దుర్లు వస్తాయి. అవి తగ్గకపోతే తప్పనిసరిగా వైద్యుని సంప్రదించాలి.