వైద్య నిపుణులు తెలిపిన వివరాల ప్రకారం.. మధుమేహం ఉన్నవారు 'లో-బిపికి' గురయ్యే అవకాశాలు ఎక్కువ. భోజనం సరైన సమయంలో తీసుకోకపోవడం, లేదా అల్పాహారం, మధ్యాహ్న భోజనానికి మధ్య సమయం ఎక్కువగా వుండటం లోబీపీకి కారణం. కార్బొహైడ్రేట్స్ కలిగిన బంగాళాదుంప, పాస్తా , పండ్లు వంటివి ఆహారంలో తీసుకోకపోవడం. భారీగా వ్యాయామాలు చెయ్యడం. అలాగే రక్తంలో చక్కెర తగ్గినా లోబీపీ వస్తుంది. మద్యాన్ని అధికంగా సేవించడం వల్ల కూడా లోబీపీ వస్తుంది. నీటిని లేదా పానీయాలను తగిన మోతాదులో సేవించకపోవడం కూడా కారణమే. మూత్రపిండాల వ్యాధి లేక ఇన్ఫెక్షన్ ను కలిగి వుండటం కూడా లోబీకి కారణం కావచ్చు. క్షయ, క్యాన్సర్, లివర్ వంటి ఇతర వ్యాధులకు గురయ్యే వారికీ లోబీపీ రావచ్చు. హైపటైటిస్-Cకి చికిత్సా చేసే ఇన్సులిన్, యాంటి వైరల్ మందులను అధికంగా వాడటం కూడా కారణం కావచ్చు. Images Credit: Pixels and Pixabay